Advertisement
సాధారణంగా చాలా మంది పుట్టే సమయంలో కొన్ని మచ్చలతో పుడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి నాలుకలో కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు ఏది అంటే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పుట్టుమచ్చలు అనేవి వాటి యొక్క రంగును బట్టి ఫలితాలు అనేవి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Advertisement
also read:TWINS BIRTH : నయనతార-విగ్నేష్ శివన్ దంపతులకు కొత్త చిక్కులు
Advertisement
పుట్టుమచ్చ అనేది గోధుమరంగులో ఉందా నలుపు వర్ణంలో ఉందా, అది ఏ రంగులో ఉన్నది అనేది మనం చూసుకోవాలి. నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ, గోధుమ వర్ణంలో ఉంటే వారు అన్న మాటలు నిజం అవుతాయి. అదే పుట్టుమచ్చ నాలుక చివరి భాగంలో బ్లాక్ కలర్ లో ఉంటే వారు అన్న మాటలు చాలా లేటుగా నెరవేరుతాయి. కానీ ఈ పుట్టు మచ్చలు ఉన్న వారు ఎప్పుడు కూడా అవతలివారి మంచిని పలకాలి కానీ, శపించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వీరు అన్న మాటలు నిజం అవుతాయి కాబట్టి అవతలి వ్యక్తులకు శాపనార్థాలు పెట్టడం, వారిని బాధ పెట్టడం వంటివి చేస్తే, వారు శాపం పెట్టినవారు ఎంత అయితే బాధపడతారో అంతకు మించి ఈ శాపనార్ధాలు పెట్టిన వారు కూడా బాధ పడతారని శాస్త్ర నిపుణులు అంటున్నారు. నాలుక చివర పుట్టుమచ్చ ఉన్న వారు అందరినీ దీవించాలి కానీ విమర్శించ కూడదని తెలియజేస్తున్నారు.
also read:ఈ 10 మంది స్టార్స్.. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ అని మీకు తెలుసా..?