Advertisement
Arjun Reddy Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండేలు హీరో హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. సమాజ పోకడలకు భిన్నమైన వ్యక్తిత్వమున్న ఓ యువకుని ప్రేమ కథను ఆవిష్కరిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఆవేశం, నిర్లక్ష్య పూరిత మనస్తత్వం ఉన్న యువకుడిగా విజయ్ దేవరకొండ నటన, సందీప్ రెడ్డి లవ్ స్టోరీని కొత్త కోణంలో ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్ రెడ్డి మూవీ ఇతర భాషలలో కూడా తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Advertisement
Read also: BAALU MOVIE HEROINE: పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?
Advertisement
అయితే ఈ మూవీ అంటే చాలామంది బూతులు అనుకుంటారు. కానీ ఈ చిత్రం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతులు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తిగత కారణాల వల్లో, లేదా లవ్ ఫెయిల్యూర్ అయిందనో ఈమధ్య ఆ*త్య చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కానీ అలా కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ వదిలేసినప్పటికీ అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. అందువల్ల ప్రేమ ఒక్కటే జీవితం కాదని.. మనకంటూ ఒక జీవితం ఉంటుందని విషయాన్ని ఈ సినిమా నుంచి నేర్చుకోవచ్చు. అలాగే ఈ చిత్రంలో అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు. అలా చేస్తే ఆమె ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది.
ఇక ఈ చిత్రంలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆ పెళ్లిని ఆపలేని స్టేజ్ లో ఉంటాడు. దానికి కారణం మెర్ఫిన్ తీసుకోవడం. కానీ మనం అలా చేయకుండా మనల్ని ప్రేమించే వారిని వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వద్దు. అలాగే ఈ చిత్రంలో అర్జున్ రెడ్డికి శివ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం. సంతోషంలోనే కాకుండా బాధలోనూ తోడుండే అలాంటి ఫ్రెండ్ ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఇక అర్జున్ కి ప్రీతి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కనిపిస్తుంది. అప్పుడు అర్జున్ కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా నా బిడ్డగా పెరుగుతుందని చెబుతాడు. నిజంగా ప్రేమించడం అంటే అది. కానీ చివరికి ఆ కడుపులో పెరుగుతుంది తన బిడ్డ అని తెలుస్తోంది. ఇలా అర్జున్ రెడ్డి మూవీ నుంచి మనం కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు.
Read also: PAWAN KALYAN ON UNSTOPPABLE 2: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య