Advertisement
సాధారణంగా చాలామంది ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయి ఏదో ఒకటి తినాలనుకుంటారు.. అయితే ఉదయాన్నే ఏదో ఒకటి తినాలని కాకుండా ఆరోగ్యంగా ఉండే వాటిని తింటే బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఉదయం పూట మనం ఏదైతే తింటామో దాని మీదే మీ రోజంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.. మనం ఉదయాన్నే ఏం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
Advertisement
తెల్ల రొట్టె :
Also Read: ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!!
చాలామంది ఉదయం ఆఫీసుకు లేదంటే ఇతర పనులకు వెళ్లాలనే హడావిడిలో తెల్ల రొట్టె టీ, లేదంటే దానిపై బటర్ లేదా జామ్ కలుపుకొని తింటూ ఉంటారు. తెల్ల రొట్టెలో పోషకాలు తక్కువగా ఉంటాయి , అలాగే ఇది మన జీర్ణ క్రియపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.. కాబట్టి దీనికి దూరంగా ఉండాలని అంటున్నారు. అయితే అల్పాహారంలో భాగంగా మల్టీ గ్రేయిన్ బ్రెడ్ తినవచ్చు.
కాఫీ:
సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే ముందుగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది తాగితే మైండ్ రిఫ్రెష్ అవుతుందని అనుకుంటారు. కానీ కాఫీ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల జీర్ణ క్రియపై ప్రభావం చూపుతోందట.. కాఫీ తాగాలనిపించినప్పుడు కడుపునిండా ఏదైనా తిన్నప్పుడు మాత్రమే తాగండి.
Advertisement
ప్యాకింగ్ జ్యూస్ :
Also Read: దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్ వెనక ఇంత కథ ఉందా..?
కొంతమంది ఉదయం లేవగానే జ్యూస్ తాగితే మంచిదని ముందుగానే జ్యూస్ ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకుంటారు. దాన్ని ఉదయం లేవగానే తాగుతారు. ఆ అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. ఎందుకంటే ప్యాక్ చేసిన జ్యూస్ లో ఫ్రీజర్వేటివ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయట ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
తృణధాన్యాలు:
అల్పాహారంగా తృణధాన్యాలు తినే ధోరణి పెరిగింది. అయితే ప్రాసెస్ చేసినవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ధాన్యాలు తక్కువ చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులు రావచ్చని వైద్యులు అంటున్నారు.
Also Read:Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!