Advertisement
స్మార్ట్ ఫోన్ ఈమధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్ తోనే గడుపుతున్నాం. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. ఇంకా కొంతమంది అయితే ఉదయం నిద్ర లేచింది చాలు.. రాత్రి పడుకునే వరకు, నిద్ర మానేసి మరి ఫోన్ చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు కానీ స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే నిద్ర పట్టదు. అయితే చాలామందికి టాయిలెట్ సీట్ పై కూర్చుని పేపర్ చదివే అలవాటు ఉంటుంది.
Advertisement
Read also: అన్న నరేష్ మామూలోడు కాదు బాబోయ్..! నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లోనే తీసుకువెళ్లి గంటల తరబడి అందులో కూర్చొని గడుపుతుంటారు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు మరీ ఎక్కువ అవుతుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్లలో మన ఆరోగ్యానికి హానికరమైన లేదా హాని కలిగించే బ్యాక్టీరియా అన్నీ సమయాలలోనూ ఉంటుంది. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. టాయిలెట్ సీట్ పై పది నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం ప్రమాదకరం. ఎందుకంటే కంటికి కనిపించని హానికర జీవులు టాయిలెట్లలో ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రమాదకరం. టాయిలెట్ లో ఫోన్ వాడడం వల్ల పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
ఎక్కువసేపు టాయిలెట్లో ఉండడం వల్ల పాదాలు మోద్దు బారడం ప్రారంభిస్తాయి. ఈ తప్పును నిరంతరం పునరావృతం చేయడం వల్ల పైల్స్ వ్యాధి బారినపడే అవకాశం ఉంది. అంతేకాదు ఎక్కువ సమయం టాయిలెట్లో ఫోన్ తో గడపడం వల్ల కూడా డయేరియా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి కారణంగా వాంతులు, విరోచనాలు వస్తాయి. టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చునే వారికి వెన్ను, పొట్ట కండరాలు వదులుతాయి. ఈ పరిస్థితి మీ తుంటి, కాలు కండరాలు బలహీనపడడానికి కారణం అవుతుంది. అందువల్ల ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చోవద్దు. ఇలా చేయడం వల్ల మీ చేతులారా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!