Advertisement
చాలామంది ఉంగరాలు, చైన్ లకి దేవుడి ప్రతిమలు ఉంచుకోవడం చూస్తూనే ఉంటాం. వాటిని ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. కొంతమంది వివిధ రకాల డిజైన్లతో ఉన్న ఉంగరాలను ధరిస్తే.. మరి కొంతమంది జాతకం ప్రకారం వివిధ రకాల రంగురాళ్లు ఉన్న ఉంగరాలను ధరిస్తారు. ఇక మరి కొంతమంది వారి ఇష్ట దైవాలకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది.
Advertisement
Read also: MAHESH BABU AND NTR: మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !
అవి ఏంటంటే.. ఏదైనా ఉంగరం ధరించేటప్పుడు దేవుడి తల ఎటువైపు ఉండాలి, కాళ్లు ఎటువైపు ఉండేలా ఆ ఉంగరాన్ని ధరించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడి కాళ్లు మనికట్టు వైపు, దేవుడి తల వేళ్ళ గోర్ల వైపు ఉండేలా ఉంగరం ధరించాలి. అయితే ఉదయాన్నే లేవగానే వాటిని కళ్ళకు అద్దుకునే సమయంలో మన చేతిని ముడిచి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోవాలి. అలాగే మహిళలు ఇలాంటి ఉంగరాలను ధరించినప్పుడు నెలసరి సమయంలో వాటిని తీసి పక్కన పెట్టాలి. అలాగే ఏదైనా మాంసాహారం తింటున్న సమయంలో కూడా ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించకూడదు.
Advertisement
అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడమే కాకుండా మెడలో కూడా దేవుడి ప్రతిమ ఉన్న లాకెట్లు ధరిస్తూ ఉంటారు. వారు కూడా ఎలాంటి మాంసం, మద్యపానం సేవించకూడదు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి ఉంగరాన్ని మరొకరు ఎప్పుడు ధరించకూడదు. అది ఏదైనా రత్నమైన, లోహమైన వేరే వారి ఉంగరం ధరించడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరొకరి ఉంగరాన్ని ధరించడం వల్ల వ్యక్తి జీవితం పై గ్రహాల వ్యతిరేక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి. లేదంటే మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.
Read also: “చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !