Advertisement
అరుంధతి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరు మాట్లాడినా జేజమ్మ గురించే… ఎవరు పాట పాడినా జేజమ్మ గురించే. ఎంతో అఖండ విజయం సాధించిన ఈ అరుంధతి సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా విలన్ పాత్రలో సోనూ సూద్ నటించారు. ఇక ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనుష్క కెరీర్ ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఏదైనా ఉంటే అది అరుంధతి.
Advertisement
అయితే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి మీకు గుర్తుందా ? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా ? ఆ అమ్మాయి పేరు దివ్య నగేష్. మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయి పై చదువుల కోసం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయింది.
Advertisement
ఆ తర్వాత తమిళ్ లో తేదినన్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయినప్పటికీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత అదే సంవత్సరం తమిళంలో విడుదలైన మెర్క్ మెగా పి ఫైర్ కనకదుర్గ సినిమా తో.. తొలి హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక తమిళంలో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందడుగు వేసిన ఈ అమ్మాయి… త్వరలోనే టా లీవుడ్ లో కూడా అడుగుపెట్టనుంది.