Advertisement
ఈ రోజుల్లో కూడా చాలా మంది పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అంటే కొన్ని తంతులు ఉంటాయి, ఖచ్చితంగా వాటిని పాటిస్తూ ఉంటారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. వివాహ వేడుకలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్న వధూవరులకి, కచ్చితంగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అయితే అసలు ఎందుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
వశిష్ట మహర్షి భార్య అరుంధతి . బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యా దేవి. ఉపదేశం చేసేందుకు బ్రహ్మచారి కోసం వెదుకుతున్నప్పుడు వశిష్ఠ మహాముని కనపడతాడు. ఉపదేశం చేసేందుకు తగినవాడని సంధ్యాదేవి ఆయన దగ్గరకి వెళ్తుంది. . బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఉపదేశం చేయడానికి ఒప్పుకున్నాడు. సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది.
Advertisement
అగ్ని నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్యలతో పాటుగా ఓ స్త్రీ రూపం వస్తుంది. ఆ స్త్రీ రూపమే అరుంధతి. అందంగా ఉంటుంది. దానితో అరుంధతి ని వశిష్ఠుడు ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో వశిష్ఢుడు కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వచ్చెనంతవరకు ఉంచమంటాడు. ఏళ్లు గడిచిపోయాయి.
వశిష్ఠుడు రాడు. అరుంధతి మాత్రం కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమె ఎన్నాళ్లయినా కూడా కమండలం పై నుండి చూపు తిప్పలేదు. ఏమి చెయ్యలేక విశిష్టుడిని వెతికి తీసుకొస్తారు. ఇలా అరుంధతి మహా పతీవ్రతగా నిలిచిపోయింది. అకుంఠిత దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ అరుంధతి ఆకాశంలోనే ఉండిపోయింది. పెళ్లి సమయంలో అరుంధతిలా సద్గుణాలు కలిగి ఉండాలని చూపిస్తారు.
Also read: