Advertisement
దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ బద్ధ శత్రువులు. మోడీ సర్కార్ ను ఎప్పుడెప్పుడు కూల్చేద్దామా? అని ఎదురుచూస్తోంది హస్తం పార్టీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్నారు. బీజేపీ దేశంలో విద్వేషం పెంచి విభజించిందని.. తాము అందర్నీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీఎంపై మోడీ ప్రశంసల జల్లు కురిపించడం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది.
Advertisement
ప్రధాని మోడీ రాజస్థాన్ లోని బన్స్వారా పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే ప్రోగ్రాంలో సీఎం అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. పాత విషయాలను గుర్తు చేశారు. గెహ్లాట్ గొప్పదనాన్ని వివరించారు.
Advertisement
దేశంలో అత్యంత సీనియర్ సీఎంలలో గెహ్లాట్ ఒకరని అన్నారు మోడీ. ఆయన అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేత అని ప్రశంసించారు. ముఖ్యమంత్రులుగా తామిద్దరం కలిసి పని చేశామని తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమయంలో గెహ్లాట్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు మోడీ.
ప్రధాని ప్రశంసలపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రధాని మోడీ విదేశాలకు ఎప్పుడు వెళ్లినా అక్కడ విశేష గౌరవం లభిస్తోందన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనుకున్న జాతిపిత గాంధీ పుట్టిన దేశానికి ఆయన ప్రధాని అని తెలిపారు. అలాంటి దేశానికి ప్రధానిగా మోడీ తమ కంట్రీకి వచ్చినందుకు అక్కడి వారంతా గర్వపడుతుంటారని అన్నారు గెహ్లాట్.