• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..

పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..

Published on January 8, 2023 by anji

Advertisement

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తో పాటు ఓటీటి బిగ్ బాస్ లో హల్చల్ చేసిన ఈ బ్యూటీ రెండింటిలో ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత సింగర్ సిప్లిగంజ్ తో కొన్ని రోజులపాటు హల్చల్ చేసి ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా ఎక్కువగా పాపులర్ అయింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి.. టిక్ టాక్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే అషు రెడ్డి ఇప్పటికే చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Read also: ఎంత విషపు పాము కాటేసిన..! వెంటనే ఇలా చెయ్యనండి ప్రాణాలను కాపాడండి ..!

ఈ మధ్య పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక టాటూ ని కూడా వేయించుకుంది. అయితే ఈమె పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా కోసం పెద్ద సాహసమే చేసిందట. 2017 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదల అయింది. ఆ సమయంలో ఆషు అమెరికాలోని డల్లాస్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అప్పుడు డల్లాస్ లో కాటమరాయుడు ప్రీమియర్ షో చూసేందుకు సెలవు కావాలని మేనేజర్ కి మెయిల్ పెట్టిందట. ఇంకేముంది ఆ మెయిల్ వల్ల అషు రెడ్డి తన ఉద్యోగం కోల్పోయానని వెల్లడించింది. అలా తన ఉద్యోగం పోవడం వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని.. కానీ ఏ రోజు దాని గురించి పెద్దగా బాధపడలేదని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కి భక్తురాలు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని వెల్లడించింది.

Advertisement

అప్పుడు ఆమె చేసిన మెయిల్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మెయిల్ లో ఏముందంటే.. ” మంగళవారం రోజు నేను ఆఫీస్ కి రావచ్చు, రాకపోవచ్చు. రావాలని లేదు. ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ సినిమా రిలీజ్ ఉంది. ప్రీమియర్ షో చూడకపోతే నాకది సిగ్గుచేటు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ అర్థం చేసుకోకపోతే నా ఉద్యోగం వేరొకరికి ఇచ్చినా పర్లేదు. కానీ మీరు నన్ను వదులుకోరని అనుకుంటున్నా. కృతజ్ఞతలు అశ్విని రెడ్డి” అంటూ రాసి ఉంది. అషు రెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మెయిల్ చూసిన కొంతమంది నేటిజెన్లు ఈ మెయిల్ డ్రాఫ్ట్ లోనే ఉందని అంటుంటే.. మరి కొంతమంది మాత్రం.. అభిమానం ఉండవచ్చు కానీ ఇలా ఉద్యోగం వదులుకోవడం మంచిది కాదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Read also: కోవై సరళ జీవితంలో ఇంత విషాదం ఉందా..?

Related posts:

athadu-deleted-scenesమహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ 5 సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..! “నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో టైమ్స్ చూసాము ఈ తప్పుని ఎప్పుడైనా గమనించారా ? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చిరంజీవిని మొహం మీద అన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా..? చిరంజీవి రెండేళ్ల పాటు చొక్కా ఉత్తుకోకుండా వాడారు ఎందుకంటే ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd