Advertisement
జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్లానింగ్ వావ్ అనేలా ఉంటుంది. దేవర, వార్ 2 సినిమాల షూటింగ్లో పాల్గొంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అశ్విని దత్ కూతుళ్ళలో ఒకరైన స్వప్న దత్ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్ళి జరిగేది కాదని కామెంట్స్ చేశారు. తను ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని లవ్ చేసానని అయితే ఆ విషయాన్ని నాన్నకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదని స్వప్న అన్నారు.
Advertisement
నేను ప్రేమించిన వ్యక్తి కులం కులం వేరు కావడంతో నేను నాన్నకు నా లవ్ గురించి చెప్పలేక పోయానని ఆమె అన్నారు. శక్తి షూట్ సమయంలో తారక్ తో ఈ విషయం చెప్తే తారక్ నాన్నతో మాట్లాడి ఒప్పించారని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా నాన్న మొదటి అంగీకరించలేదని తారక్ మాత్రం ఎంతో కష్టపడి కన్విన్స్ చేశారని ఆమె చెప్పారు.
Advertisement
Also read:
స్వప్న దత్ చెప్పిన విషయాలను విని ఎన్టీఆర్ ని అంతా ఎంతో ప్రశంసిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకు అంతకు పెరిగిపోతుండడంతో ఫాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంద నుండి 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నటిస్తారేమో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!