Advertisement
ఆసియా కప్ 2023 టోర్నమెంట్ షెడ్యూల్ కోసం చాలా రోజులు నుండి ఎదురు చూస్తున్నాం. అయితే ఇప్పటికి ఆసియా కప్ 2023 టోర్నమెంట్ షెడ్యూల్ ని ప్రకటించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న ఉంటుంది. హైబ్రిడ్ మోడల్‌లో ఈసారి జరుగుతాయట. అంటే లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్ లో, తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక లో అవుతాయి. భారత్ మ్యాచ్‌లన్నీ కూడా శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.
Advertisement
ఎప్పటిలానే ఈసారి కూడా భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉంటాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు నేపాల్ కూడా ఉండనుంది. శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ని సెప్టెంబరు 2న ఆడనుంది. తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో ఇండియా ఆడనుంది. శ్రీలంకలోని క్యాండీలోనే ఈ మ్యాచ్ కూడా. భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశకు పక్కా రీచ్ అవుతారు.
Advertisement
ఈ విధంగా అన్నీ అయితే భారత్, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడడం చూడవచ్చు. రెండు ఫైనల్ కు వెళితే 16 రోజుల్లోనే మూడో సారి భారత్-పాకిస్థాన్ ఆడాడాన్ని చూడచ్చు. సెప్టెంబర్ 2వ తేదీ శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం 1:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్ లో కూడా చూడచ్చు.
Also read: