Advertisement
ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. కలకాలం భార్యాభర్తలు ఆనందంగా ఉంటేనే వారి వైవాహిక జీవితం బాగున్నట్టు. ఒకరికొకరు తోడై నీడై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అయితే పెళ్లి కుదరక ముందు కచ్చితంగా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. ముఖ్యంగా ఈ విషయాలని అడిగి తెలుసుకోవాలి. పెళ్లి తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భార్యా భర్తలు ఒకరి చెయ్యి ఒకరు విడవకూడదు. ఆనంద క్షణాల్లో కష్టాల్లో కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలి. పెళ్లి కి ముందు కచ్చితంగా ఈ విషయాలని అడిగి తెలుసుకోండి.
Advertisement
- పెళ్ళికి ముందు కమ్యూనికేషన్ విధానం గురించి తప్పక చెప్పుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి.
- అదేవిధంగా బంధం దృఢంగా ఉండాలి అంటే కచ్చితంగా ఎదుట వ్యక్తి ఆచారాలని నమ్మకాలని ఇంకొకరు గౌరవించాలి. కాబట్టి పెళ్లికి ముందే నమ్మకాలని పూర్తిగా తెలుసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్లాలి.
Advertisement
- పెళ్లికి ముందు భవిష్యత్తులో కుటుంబం ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అనేది పార్ట్నర్ ని అడిగి తెలుసుకోండి. అలానే పార్ట్నర్ కుటుంబం గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. ఆర్థిక స్థితి గురించి కూడా వివరించాలి. ఏ విధంగా డబ్బుని ఖర్చు చేస్తారు ఎలా పొదుపు చేస్తారు అనేది ఒకరినొకరు అడిగి తెలుసుకోవాలి.
- కెరియర్ గురించి కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. కెరీర్ గురించి తెలుసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాలి.
- పెళ్లికి ముందు బ్రేకప్ లవ్ గురించి కూడా పార్ట్నర్ ని అడిగి కచ్చితంగా తెలుసుకోండి.
- అనారోగ్య సమస్యల గురించి లైఫ్ స్టైల్ గురించి కూడా ఒకరినొకరు అడిగి తెలుసుకోవాలి. ఇలా ఈ విషయాలని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటే పెళ్లి తర్వాత సమస్యలు రావు.
Also read:
చాలా మంది బ్రాహ్మణులు ఎందుకు ఉల్లి, వెల్లుల్లి తినరు..? కారణం ఏమిటి అంటే..?
చంద్రబాబు పై కోపంతో రాయుడు వైసీపీ లో చేరాడా..? అసలు ఏం జరిగింది..?