Advertisement
గుడివాడలో తీవ్ర ఉధృత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని ఘోర అవమానం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు పేర్ని నాని పై కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఆదివారం పేర్ని నాని గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు. అది గమనించిన జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనపై వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
Advertisement
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొంతమంది యువత ఆయనపై కోడిగుడ్లను విసిరారు. గుడివాడ నుంచి ఆయన వెనుతిరిగారు. మరికొందరు కారుని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.
Advertisement
Also read:
పోలీసులు అలర్ట్ అయ్యే వాళ్ళని కంట్రోల్ చేశారు. జనసైనికుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే మరికొంత మంది పోలీసుల వాహనాలకు అడ్డుపడ్డారు. వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. ఖబర్దార్ పేర్ని నాని అంటూ చెప్పులు తీసి జనసేన నానిని హెచ్చరించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!