Advertisement
టి20 వరల్డ్ కప్-2022 లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్ కు చేరుకోగా, ఇవాళ జరిగిన మ్యాచ్ లో శ్రీలంక పై గెలుపుతో ఇంగ్లాండ్ రెండో జట్టుగా సెమీస్ కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆతిద్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురయింది.
Advertisement
ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే సెమీస్ కు చేరాలని భావించిన ఆసీస్, ఇంగ్లాండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండు, ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
Advertisement
ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టాక్స్ బాధ్యతయుతంగా ఆడి ఇంగ్లాండును విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిన అద్భుతమైన పోరాటపటిమ కనబరిచి ఇంగ్లాండ్ ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
READ ALSO : Like Share & Subscribe Review : ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ రివ్యూ