Advertisement
వరల్డ్ కప్ గెలిచినా ఆనందం ఆసీస్ క్రికెటర్స్ లో గట్టిగానే ఉంది. అయితే.. వారు ప్రపంచ కప్ గెలవడం ఇది ఆరవ సారి. ఈ సారి వారి ఆనందం శృతి మించుతోందనే చెప్పవచ్చు. వరల్డ్ కప్ ట్రోఫీ మీద మిచెల్ మార్ష్ కాళ్ళు పెట్టుకుని తీసుకున్న ఫోటో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వివాదం ఇప్పటికీ సర్దుమణగలేదు. తాజాగా మరో వివాదం ముంచుకొచ్చింది. ఇండియన్ క్రికెటర్స్ ను అవమానించే విధంగా ఓ ఆస్ట్రేలియన్ మీడియా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ సైతం లైక్స్ కొట్టడం వివాదాస్పదంగా మారింది.
Advertisement
ఇప్పటికీ గెలుపు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చిన భారతీయులు.. కప్పు గెలిచిన ఆస్ట్రేలియా ప్రవర్తనపై ఆగ్రహంగా ఉన్నారు. ట్రోఫీపై కాళ్ళు పెట్టి కూర్చోవడాన్ని సమర్ధించని ఇండియన్ క్రికెట్ అభిమానులు తాజాగా ఆస్ట్రేలియా మీడియా పెట్టిన మరో పోస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. ఆస్ట్రేలియా మీడియా పెట్టిన ఈ పోస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ లాంటి క్రికెటర్స్ లైక్ కొట్టడం కూడా మరింత వివాదాస్పదం అవుతోంది.
Advertisement
— Out Of Context Cricket (@GemsOfCricket) November 24, 2023
అయితే.. ఈ పోస్ట్ వైరల్ అవుతుండడంతో ఫ్యాట్ కమిన్స్ తన తప్పుని గుర్తించి మళ్ళీ అన్ లైక్ చేసారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. ఓ సౌత్ ఆస్ట్రేలియన్ పదకొండు మందికి జన్మని ఇచ్చినట్లు ఒక ఫోటో ఉంది. బెడ్ పై ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉంటె.. చుట్టూ నర్స్ ల చేతిలో ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు. ఈ పోస్ట్ ను చూసి భారత క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ పోస్ట్ కి ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ లైక్ కొట్టడంతో ఈ ఇష్యూ మరింత వివాదాస్పదం అవుతోంది.
Read More: