Advertisement
భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ సంబంధించి విమర్శల వేడి పెరుగుతుంది. ఇప్పటికే ఇరుదేశాల ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగగా, సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఫిబ్రవరి 9వ తేదీన నాగపూర్ వేదికగా భారత్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా వెటకారంగా ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
Advertisement
also read: పాపం కొరటాల శివకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు చిరు ఇప్పుడు ఎన్టీఆర్!
All out for 36 😳
The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7
— cricket.com.au (@cricketcomau) February 6, 2023
2020లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో 36 పరుగులకే కుప్పకూలినది. దీనికి సంబంధించిన ఒక వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ ) ట్విట్టర్లో పోస్ట్ చేసి, 36 పరుగులకే ఆల్ అవుట్.. ది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం నుంచి ప్రారంభం” అంటూ రాస్కొచ్చింది.. ఈ ట్విట్ వెనుక ఉన్న అర్థం ఏంటంటే.. భారత్ క్రికెటర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే.. దీంతో ఆస్ట్రేలియా కుటీల ప్రయత్నాన్ని గమనించిన భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు..
Advertisement
All out for 36 😳
The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7
— cricket.com.au (@cricketcomau) February 6, 2023
“మరి.. ఆ సిరీస్ స్కోర్ లైన్..? ఊరికే అడుగుతున్నా”అని కౌంటర్ ఇచ్చాడు.. ఆ మొదటి టెస్టులో తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా.. ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో దూసుకుపోయి 2-1 తేడాతో సిరీస్ ని చేజిక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి తొలి ఆసియా జట్టుగా ఘనత సాధించింది.. ఈ సిరీస్ యొక్క ఫలితాన్ని చెప్పాలని ఆకాష్ చోప్రా పరోక్షంగా కౌంటర్ ఇవ్వడంతో, ఇక అటు నుంచి రిప్లై మాత్రం రాలేదు.
also read: