Advertisement
Avatar-2 Movie Review in Telugu: హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్‘ వచ్చి దాదాపు 13 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాలోని విజువల్ వండర్ దర్శకుడు జేమ్స్ కామెరున్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాకు జనం పట్టంకట్టడంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అవతార్-2 మూవీని రిలీజ్ కు రెడీ చేశాడు జేమ్స్ కామెరున్. అయితే ఈ సినిమా రిలీజ్ అయింది.
Advertisement
Avatar-2 Movie Review in Telugu
Avatar 2 Movie Story in Telugu – కథ
అవతార్ కోసం జేమ్స్ కామెరున్, సాంకేతికత సాయంతో ‘పండోరా’ అనే ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ ‘నావి’ అనే అటవీ తెగ జీవిస్తుంటుంది. ప్రకృతి ప్రాణంగా జీవించే ఆ వింత ప్రాణులకు, అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు మధ్య జరిగే పోరాటమే ‘అవతార్’ థీమ్. అయితే, ఇందులో యాక్షన్ కు మించిన లవ్ స్టోరీ దాగుంది. ఆ ప్రేమ కథ ఎన్నో హృదయాలను హత్తుకుంది. జేక్ సల్లి (సామ్ వర్తింగ్ టన్) నవికాదళంలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై, కాళ్లు పోగొట్టుకుంటాడు. పండోరాలోని విలువైన సంపదను తీసుకొచ్చేందుకు రిసోర్సెస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డిఏ) అధికారులు చేపట్టిన అవతార్ ప్రోగ్రాం లో పాల్గొంటే నడవగలిగే స్థితికి వస్తానని తెలుసుకున్న జేక్ అందుకు సిద్ధపడతాడు. ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ గ్రేస్ అగస్టిన్ (సిగర్ని వీవర్) ముందుగా జేక్ ను వద్దన్నా మరో దారి లేక ఓకే అంటుంది.
Advertisement
పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న జేక్ అవతార్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. పండోరా లోని విలువైన ఓ చెట్టు రహస్యాన్ని చెబితే భూమి మీదకు పంపించి, కాళ్లు వచ్చే ఏర్పాటు చేయిస్తానని జేక్ కు ఓ అధికారి ఆఫర్ ఇస్తాడు. గ్రేస్ బృందంతో కలిసి జేక్ పండోరా ప్రపంచంలో అడుగుపెడతాడు. ఓ క్రూర జంతువు దాడిచేసే క్రమంలో మిగిలిన వారంతా తిరిగి వెళ్లిపోగా జేక్ అక్కడే ఉండిపోతాడు. ఇక అతను బతికుండడం కష్టమే అని అంతా అనుకుంటారు. కట్ చేస్తే నైత్రీ అనే నావి తెగ అమ్మాయి రక్షిస్తుంది. కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంది. నావి వారు అంత సులభంగా ఇతరులను నమ్మరు కాబట్టి ఓ పరీక్ష పెడతారు. మరి ఆ పరీక్ష ఏంటి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే మనకు సినిమా చాలా ఆహ్లాదంగా, అద్భుతంగా అనిపిస్తుంది.
పార్ట్ 2 :
జేక్ సల్లీ ఓమటికాయ తెగకు నాయకుడై ఉంటాడు. తన భార్య నేతిరితో పాటు తన పిల్లలతో సంతోషంగా ఉంటాడు. జేక్ సల్లీ – నేతిరి దంపతులకు నెటెయమ్, లోక్ అనే ఇద్దరు కొడుకులు, టక్ అనే కూతురు ఉంటారు. కిరి అనే పెంపుడు కూతురు కూడా ఉంటుంది. ఈ పిల్లలతో పాటే స్పైడర్ అనే మానవబాలుడు కూడా కలసి ఉంటాడు. అందరూ కలిసకట్టుగా ఆనందంగా ఉంటారు. అయితే, మరోవైపు జేక్ సల్లీ – నేతిరి లపై పగతో క్వారిచ్ రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా తన పగను తీర్చుకోవడానికి క్వారిచ్ తన మనుషులతో జేక్ సల్లీ – నేతిరి లను వెతుక్కుంటూ వస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో జేక్ తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి అందర్నీ మెట్కాయినా అనే సముద్ర ప్రాంతానికి తీసుకు వెళ్తాడు. మరీ ఆ సముద్ర వాసులతో జేక్ సల్లీ ఫ్యామిలీ ఎలా కలిసి పోయింది ?, ఈ మధ్యలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?, చివరకు క్వారిచ్ వీరిని ఎటాక్ చేశాడా? లేదా ?, ఎటాక్ చేస్తే ఎవరు గెలిచారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
– అబ్బురపరిచే దృశ్యాలు,
– కథ, కథనం,
– సాంకేతిక విలువలు,
– టైటానిక్ తార కేట్ విన్స్ లేట్ కనిపించడం,
మైనస్ పాయింట్స్:
– సినిమా నిడివి పెద్దగా ఉండడం,
– ఫస్ట్ పార్ట్ చూడని వారికి కన్ఫ్యూజన్ గా ఉండడం,
రేటింగ్: 2,75/5
Read Also : తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే