Advertisement
శ్రీవారి లడ్డు కల్తీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలకు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో జంతువులకు వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగించడం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ల్యాబ్ రిపోర్ట్ లు కూడా ఈ విషయాన్ని తేల్చడంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన తిరుమల శ్రీవారి ఆలయం లో అపచారం జరిగినట్లుగా హైందవ సమాజం భావించింది. గతంలో జగన్ సర్కార్ హయాంలో తిరుమలలో లడ్డూలలో కల్తీ జరిగిందని తిరుమలలో అన్న ప్రసాదం కూడా నాణ్యత లేకుండా పోయిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
దేశవ్యాప్తంగా అనేక ఆలయాలలో ప్రసాదాల తయారీ పైన దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని ఆలయాల్లోనూ ప్రసాదాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి ల్యాబ్ కి పంపించారు. ఆలయాల పవిత్రతను కాపాడటం పైన దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది తిరుమల శ్రీవారి లడ్డూలు గత ప్రభుత్వ హయాంలో రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో లక్ష లడ్డూల్ని కూడా పంపించడం జరిగింది.
Advertisement
ప్రస్తుతం కల్తీ జరిగినదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ లడ్డూలు తిరుమల నుంచి అయోధ్యకు పంపించడం జరిగింది. తిరుమల లడ్డు కల్తీపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగండతో అయోధ్యలోని రామ ముందల నిర్వాహకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. బాల రాముడికి బయట సంస్థలు తయారు చేసిన ప్రసాదాలని నైవేద్యంగా పెట్టడాన్ని నిషేధించారు. అయోధ్య రామాలయంలో ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలను రామునికి నైవేద్యంగా పెట్టాలని భక్తులకు ప్రసాదంగా అందించాలని పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి