Advertisement
అయ్యన్నపాత్రుడు.. టీడీపీ సీనియర్ నేత. ఈయన మీడియా ముందుకొస్తే.. హెడ్ లైన్ వార్తలకు కొదవేం ఉండదు. ఏదీ మనసులో దాచుకోరు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు. అది అవతలి పార్టీ వాళ్లయినా.. సొంత పార్టీ వాళ్లయినా తగ్గేదే లేదనే తరహాలో ముందుకెళ్తుంటారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఈయన.. సొంత పార్టీనేత గంటా శ్రీనివాసరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
Advertisement
‘‘ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానా? పార్టీలో అందరూ రావాలి.. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక’’ అంటూ రెచ్చిపోయారు అయ్యన్న. అంతటితో ఆగకుండా.. ఇన్ని రోజులు గప్ చుప్ గా ఇంట్లో దాక్కుని, ఎన్నికలు వస్తుండగానే బయటకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
గంటానే కాదు.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో బయటకు రాని నేతలందరికీ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు అయ్యన్నపాత్రుడు. తాము ఎవరికీ వ్యతిరేకులం కాదని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని ఫైరయ్యారు. అయ్యన్న వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల సమయంలో టీడీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయిపోయారు. పెద్దగా కనిపించిన సందర్భాలు తక్కువే. ఒకానొక సమయంలో వైసీపీలో చేరుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, దీనిపై ఆయన రియాక్ట్ కాలేదు. కానీ, ఇటీవల లోకేష్ ను కలిశారు. ఆయన పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో గంటా మళ్లీ యాక్టివ్ అయ్యారని.. టీడీపీలో కొనసాగుతారన్నది అందరికీ అర్థం అయింది. ఈ నేపథ్యంలోనే అయ్యన్న అలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.