Advertisement
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని రాజమండ్రి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. వీడియోలు తీస్తున్న మీడియా ఫోన్లను లాక్కున్నారు. ఇంటి కూడా కూల్చివేత వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్న పై అభియోగం ఉంది.
Advertisement
దీంతో సిఐడి పోలీసులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసి, చింతకాయల రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అయ్యాన్నపై కేసు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సిఐడి పోలీసులు తెలిపారు. అయితే, ఈ సంఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడు. గోడలు దూకి తలుపులు పగలగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయడం దిగ్బ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోంది. ఇప్పటికే 10కి పైగా కేసులు పెట్టారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టిన పోలీసులు మారలేదు. దొంగల్లా పోలీసులు ఇళ్ళ మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై ప్రశ్నిస్తున్న బీసీ నేతల గలాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు. ప్రభుత్వ దోపిడిపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అరెస్టులు అని మండిపడ్డారు చంద్రబాబు.
read also : డాషింగ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ?