Advertisement
జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో ఆర్పి కూడా ఒకరు. కిర్రాక్ ఆర్పి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్పి బయటకు వచ్చే సమయానికి టీం లీడర్ అయ్యారు. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక కర్రీ పాయింట్ ని స్టార్ట్ చేశారు. తర్వాత జబర్దస్త్ గురించి అనేక సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతానికి టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా మాట్లాడుతున్నారు.
Advertisement
Advertisement
మాజీ మంత్రి రోజా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఆర్పి మీద సీరియస్ అయ్యారు సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్. జబర్దస్త్ కి రాకముందు నువ్వు ఎంత నీ బతుకెంత అని ప్రశ్నించారు. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత నిన్ను నలుగురు గుర్తుపట్టేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయా అని అన్నారు. చిత్ర సీమకే తండ్రి వంటి ఎమ్మెస్ రెడ్డి గారు కొడుకు శ్యాంప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెడితే అదే సంస్థ ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదా..? అన్నం పెట్టిన చెయ్యిని కొరుకుతావా అని ఆర్పీ మీద మండిపడ్డారు.
Also read:
అన్నం పెట్టిన చేయని కొరికితే అన్నం కూడా దొరక్కుండా పోతుంది అని అన్నారు. ఎంతో మందికి పని ఇచ్చి అన్నం పెట్టే ఆ సంస్థ ఇంకా బాగుండాలని కోరుకోవాలి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని అన్నారు. నాకు మంచి జీవితం ఇచ్చింది కూడా ఇదే సంస్థ. ఈరోజు ఇంత పెద్ద స్టార్‌ని చేసింది కూడా వాళ్లే అని బాబు మోహన్ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!