Advertisement
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎన్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే వచ్చిన ట్రైలర్, పాటలు, టీజర్ తో పాజిటివ్ రెస్పాన్స్ ని క్రియేట్ చేసింది. బాక్స్ వద్ద సినిమా అదరగొట్టింది. ఈ మంచి సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూలై 14న గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అయింది.
Advertisement
Advertisement
రిలీజ్ అయినప్పటి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవి చైతన్య యాక్టింగ్ అయితే అదిరిపోయింది అని.. ఇప్పటికే అనేక ప్రశంసలు ఆమెకి అందాయి. 10 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా ఫస్ట్ వీక్ లో దాదాపు 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. అల్లు అర్జున్, రవితేజ, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాని అభినందించారు. వైష్ణవి చైతన్య నటనకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమాకి భారీ కలెక్షన్లు రావడంతో ఓటిటి రిలీజ్ ని కొన్ని రోజులు వాయిదా వేయాలని నిర్మాతలు అనుకున్నారు. ఆహాలో ఈ సినిమా సెప్టెంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also read: