Advertisement
నాగచైతన్య, శోభితను నిశ్చితార్థం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. సమంత పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. వారు ఎంగేజ్మెంట్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఆగస్టు 8న నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ వేడుకల ఫోటోలను నాగార్జున షేర్ చేశారు. నూతన జంటను ఆశీర్వదించారు. నాగచైతన్య మాజీ భార్య సమంత ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుంది అని నెటిజెన్స్ ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగింది ఎన్నో విజయాలని అందుకుంది. మంచి పేరు కూడా సంపాదించుకుంది.
Advertisement
సమంత వ్యక్తి గత జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. నాగచైతన్యను 2017 లో పెళ్లి చేసుకుంది. విడాకుల తర్వాత ఆమె మానసికంగా కృంగిపోయింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సమంతలాగే దగ్గుబాటి లక్ష్మీ ఒంటరిగా మిగిలిపోయింది. నాగార్జున 1984లో నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య సంతానంగా పుట్టాడు. వివాహమైన నాలుగేళ్లకు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాంతో విడాకులు తీసుకున్నారు.
Advertisement
Also read:
విడాకుల తర్వాత దగ్గుబాటి లక్ష్మీ అమెరికా వెళ్ళిపోయారు. నాగచైతన్య తల్లి వద్దే పెరిగాడు సమంత నాగ చైతన్య ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి కలిసి నటించారు. 2010లో విడుదలైన ఏ మాయ చేసావే సమంతకు ఫస్ట్ సినిమా. సెట్స్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత రిలేషన్ కొనసాగించారు. చాలాకాలం సీక్రెట్ గా ఈ జంట డేటింగ్ చేసారు. వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అక్కినేని నాగార్జున అఫీషియల్ గా వీళ్ళ నిశ్చితార్దాన్ని ప్రకటించారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!