Advertisement
Balagam Movie Fame Roopa Laxmi: ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా “బలగం”. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపిస్తూ.. ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా, పల్లె సంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. ఈ చిత్రాన్ని అంత చక్కగా చూపించారు దర్శకుడు వేణు ఎల్దండి. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ తమ పాత్రలలో జీవించేశారు.
Advertisement
Balagam Rupa Lakshmi
అలాగే ఈ చిత్రంలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూపలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పలు విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించారు రూప లక్ష్మి. అయితే ఈమె ఈ సినిమా కంటే ముందు కొన్ని సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలతో రూప లక్ష్మికి అంతగా గుర్తింపు రాలేదు. తాను ఎవరో తెలియక ముందే డైరెక్టర్ హరీష్ శంకర్, బోయపాటి శ్రీనివాస్ తనకి మంచి మంచి అవకాశాలు ఇచ్చారని తెలిపింది.
Advertisement
Balagam Movie Fame Roopa Laxmi
తనకి పెద్ద ఆర్టిస్టుల మధ్య సీన్స్ పడ్డాయని తెలిపింది రూప లక్ష్మి. జయ జానకి నాయక, వినయ విధేయ రామ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు అలా వచ్చినవేనని తెలిపారు. ఇక జయ జానకి నాయక సినిమాలో తన కామెడీ టైమింగ్ ని ఇప్పటికీ అంతా ప్రశంసిస్తారని.. కాకపోతే బలగం సినిమాతో మాత్రం నేనెవరో తెలియని చాలామందికి నన్ను దగ్గర చేసిందని తెలిపింది. ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది రూప లక్ష్మి. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పింది.
Read also: రాజమౌళి, అయన భార్య రామా రాజమౌళి ఎందుకు పిల్లల్ని వద్దని అనుకున్నారంటే ?