Advertisement
నందమూరి ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది వివిధ రకాల ప్రమాదాల వల్ల మరణిస్తూనే ఉన్నారు. హరికృష్ణ యాక్సిడెంట్ అయి చనిపోతే, నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఇలా ఆ ఫ్యామిలీలో వరుస విషాదాలు నందమూరి అభిమానులను వారి కుటుంబాన్ని ఎంతగానో కలవరపరుస్తున్నాయి. అయితే తారకరత్న మరణించిన తర్వాత వారి ఫ్యామిలీని బాలకృష్ణ సొంత వాళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. తారకరత్న పిల్లల బాధ్యత తానే తీసుకుంటానని అందరి ముందే చెప్పేసాడు.
Advertisement
Also Read:చిరంజీవి మోహన్ బాబు మధ్య విభేదాలు.. క్లారిటీ వచ్చినట్టేనా..?
అయితే చాలా సందర్భాల్లో అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణ తప్ప ఇంట్లో వాళ్ళందరూ తమను దూరం పెట్టారని చాలా పోస్టులో బయటపెట్టింది.. ఈ క్రమంలో బాలకృష్ణ తారకరత్న పేరు అందరికీ గుర్తుండిపోయే ఒక గొప్ప పని చేస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వస్తోంది. బాలకృష్ణ హిందూపురం నుండి ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలుసు. ఆయన తారకరత్న పేరు మీద హిందూపురంలో ఉన్న హాస్పటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారట.
Advertisement
Also Read:ఉగాది రోజు తలంటు స్నానం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే..?
హిందూపురంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కార్డియో థెరపిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది పేదవారిని కాపాడడం కోసం ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ వైద్యాన్ని బాలకృష్ణ పూర్తి ఉచితంగా అందించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కట్టించిన హాస్పిటల్ లో ఉన్న H-BLACK కి తారకరత్న గుర్తుగా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కోట్ల విలువ గల హాస్పిటల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని హాస్పిటల్ కి అందించినట్లు సమాచారం. ఈ విధంగా బాలకృష్ణ నిర్ణయం తీసుకోవడంతో నేటిజన్స్ అంతా గొప్ప మనసు చాటుకుంటున్నారంటూ కామెంట్ పెడుతున్నారు.
Also Read: Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?