Advertisement
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలావరకు కార్లు, జీపులు గాల్లోకి ఎగిరే సీన్లు మనం ఇప్పటివరకు చాలానే చూసి ఉంటాం. ఈ మాదిరిగానే ఈ యాడ్ లో బకెట్లతో రౌడీల భరతం పట్టాడు. ఈ వీడియో చూస్తే మనమంతా వావ్ అనాల్సిందే.. సాధారణంగా ఏదైనా ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించాలంటే దానికి ప్రచారం చాలా అవసరం. వినూత్నమైన మార్కెటింగ్ ఆలోచనతో వ్యాపారం చేయటం చాలా కష్టం.
Advertisement
అయితే ఇతర బ్రాండ్ల నుండి పోటీ ఏర్పడ్డప్పుడు కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు తగినంత లాభదాయకంగా మార్చడానికి నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్రాండ్ RFL క్రియేటివిటీ టీం చేసిన ఐడియా అదరహో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచార ప్రకటన ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఐపీఎస్ అధికారి దీపాన్షికాబ్రా ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Advertisement
यकीन मानें, ये बांगलादेशी बाल्टी का विज्ञापन है.😂 pic.twitter.com/AMML2sezOY
— Dipanshu Kabra (@ipskabra) January 25, 2023
వీడియోలో బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్యాండ్ ఆర్ఎఫ్ఎల్ బకెట్ ఇన్నోవేటివ్ యాడ్ లో ఆ హీరో సదరు కంపెనీకి చెందిన రెడ్ బకెట్ చేతిలో పట్టుకొని విలన్ గ్యాంగ్ పై విరుచుకు పడడం కనిపిస్తుంది. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో కార్లు జీపులు ఎలాగైతే గాల్లోకి ఎగురుతాయో ఈ బకెట్ యాడ్లో కూడా రౌడీల భరతం పడతాడు. ఈ బకెట్ తో కొడితే రౌడీల వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి పేలిపోతుంది. ఈ విధంగా బకెట్ తో బాలకృష్ణ సినిమాలో ఏ విధంగా ఫైట్ సీన్ ఉంటుందో ఆ విధంగానే బకెట్ ఫైట్ చూపించారని చెప్పవచ్చు.
also read: