Advertisement
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ ఫుల్ యాక్షన్ కి ఇప్పటికి ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ అంటే నందమూరి బాలకృష్ణ గారే. అంత బలమైన డిక్షన్ లేదా డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేయటం చాలా కష్టం. 40 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య ఎన్నో రకాల పాత్రలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తరువత, ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడం రికార్డ్. థానా 100వ సినిమాగా 56 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో వార్ సీక్వెన్స్‌లు చేయడం, అయినా కష్టపడి పనిచేసే నేచర్‌కి ఓక సూచన.
Advertisement
# జానకి రాముడు
జానకి రాముడు సినిమాను ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలయ్య ఈ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.
#చంటి
తమిళంలో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాను తెలుగులో బాలయ్య తో రీమేక్ చేయాలని అనుకున్నారు పరుచూరి బ్రదర్స్. బాలయ్యకు కథ కూడా చెప్పారు. అయితే చివరగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన చంటి సినిమా సూపర్ హిట్ అయింది.
#సింహరాశి
రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి, రాజశేఖర్ కెరీర్ టర్న్ చేసిన సింహరాశి సినిమాను దర్శకుడు సముద్ర ముందుగా బాలయ్యతో చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్యకు రీమేక్ సినిమా చేయటం ఆ టైంలో ఇష్టం లేదు. దీంతో రాజశేఖర్ ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు.
#శివరామరాజు
Advertisement
హరికృష్ణ, జగపతిబాబు, శివాజీ కలిసి నటించిన శివరామరాజు సినిమాలో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదించారట. అయితే అప్పుడు తనకు ఇలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదని బాలయ్య తప్పుకోవడంతో హరికృష్ణకు ఆ పాత్ర దక్కింది.
#అన్నవరం
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథను తాను గతంలోనే కొన్ని సినిమాల్లో చేశానని బాలయ్య భావించడంతో ఈ కథ వదులుకున్నారు.
#బాడీగార్డ్
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన రీమేక్ సినిమా బాడీగార్డ్ ను బాలయ్య తో చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ అనుకున్నారు. అసలు ఈ రీమేక్ కథను బాలయ్య కోసమే ఆయన కొనుగోలు చేశారు. బాలయ్య తప్పుకోవడంతో చివరకు వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.
#సైరా నరసింహారెడ్డి
అసలు పదేళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ రాసిన కథ ఆధారంగా బాలయ్య ఈ సినిమాను చేయాలి. మధ్యలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా వచ్చింది.
#క్రాక్
మలినేని గోపి డైరెక్షన్లో రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది. బాలయ్య కు రొటీన్ మాస్ యాక్షన్ కథలు చాలా చేసి ఉండడంతో క్రాక్ నచ్చలేదు. చివరకు రవితేజ ఈ సినిమా చేశాడు.
#సింహాద్రి
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి కథ ముందుగా బాలయ్య దగ్గరకే వెళ్లింది. బాలయ్య హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో చేయాలని విజయప్రసాద్ అనుకున్నారు. అప్పుడు బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేస్తుండడంతో ఇది వదులుకున్నారు.
read also : BCCI కొత్త రూల్.. టీ20 జట్టు నుంచి సూర్య ఔట్..?