Advertisement
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆయన సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి. ఇక బాలయ్య ఫ్యాన్స్ విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో.. మరి అలాంటి హీరో సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉంటాయి. ఆయన మూవీ వచ్చిందంటే యాక్షన్ సన్నివేశాలు, పంచు డైలాగులు, పాటలు మరియు ఆ పాటలకి బాలయ్య అదిరిపోయే స్టెప్పులు ఉండాలని అభిమానులు ఎంతో కోరుకుంటారు.
Advertisement
అభిమానుల కోరిక మేరకే దర్శకనిర్మాతలు కూడా బాలయ్య సినిమాని తెరకెక్కిస్తారు. కానీ ఒక్క ఫైట్ లేకుండా ఒక్క స్టేప్పు లేకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేశారు బాలయ్య. ఆ మూవీయే నారి నారి నడుమ మురారి. అంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణాలు రెండే రెండు. ఒకటి బాలకృష్ణ నటన కాగా. రెండవది కథ. అత్తా అల్లుళ్ళ డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీకీ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాత మురారి ఈ సినిమాని తెరకెక్కించారు. బాలకృష్ణతో ఆయనకు ఇది రెండవ సినిమా.
Advertisement
ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో సీతారామ కళ్యాణం అనే మూవీ వచ్చింది. నారి నారి నడుమ మురారి సినిమాకు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కథారచయితలు కావడం విశేషం. ఇందులో బాలకృష్ణ సరసన శోభన, నిరోష హీరోయిన్స్ గా నటించారు. సినిమాలోని పాత్రలను తమిళనాడు లోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో తీశారు. సినిమా పతాక సన్నివేశాల్లో దాదాపు 22 నిమిషాలు బాలకృష్ణ కనిపించకపోవడం విశేషం. ఈ సినిమా 1990 ఏప్రిల్ 27 న విడుదలై సూపర్ హిట్ కొట్టింది.
also read;