Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇండస్ట్రీలో అప్పటి సీనియర్ హీరోయిన్ల నుంచి ప్రస్తుతం ఆ హీరోయిన్ల కూతుర్లతో కూడా హీరోగా చేస్తున్నారు. అలాంటి బాలయ్యతో చాలా సినిమాల్లో జత కట్టింది సీనియర్ హీరోయిన్ సుహాసిని. ఆమె బాలకృష్ణ తోనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి నటీంచింది.
Advertisement
అలా ఇండస్ట్రీలో ఉండగానే దిగ్గజ దర్శకుడైన మణిరత్నం ను వివాహం చేసుకొని ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అలాంటి సుహాసిని ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ పాత్రల్లో చేయలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పొజిషన్లో ఉన్న సుహాసిని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. అమ్మ వదిన అమ్మమ్మ పాత్రల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Advertisement
అలాంటి సుహాసిని సీనియర్ హీరో బాలకృష్ణతో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బాలగోపాలుడు, మంగమ్మగారి మనవడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి చిత్రాల్లో నటించింది. అలాంటి ఈమె బాలకృష్ణకు తల్లిగా కూడా నటించారట. బోయపాటి శీను డైరెక్షన్లో 2014లో వచ్చిన లెజెండ్ మూవీలో బాలకృష్ణకు తల్లి పాత్రలో సుహాసిని కనిపించి మెప్పించారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :