Advertisement
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫుల్ ఖుషి గా ఉన్న మూవీ యూనిట్ గత రాత్రి హైదరాబాదులో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
Advertisement
ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా, ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియో పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Advertisement
ఈ సినిమా షూటింగ్ లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు ఈ వాక్యాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
also read: నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!