Advertisement
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలయ్య వరుసగా సినిమాలు నటిస్తూ దూసుకు వెళ్లిపోతున్నారు. బాలయ్య ఈ వయసులో కూడా అదే రేంజ్ లో హీరోగా నటిస్తూ దూసుకు వెళ్ళిపోతున్న విషయం తెలిసింది. ఈ వయసులో కూడా ఆయన సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నారు. బాలయ్య తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య బాబు ఎప్పుడు మాట్లాడినా నాన్న ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతారు కానీ అమ్మ బసవతారకం గురించి చాలా తక్కువ. తాజాగా ఆమె గురించి రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు.
Advertisement
సినిమాల్లో రాజకీయాల్లో ఎక్కువగా ఎన్టీ రామారావు ప్రస్తావనే వస్తుంది. ఆయన మూవీస్ ఆయన రాజకీయం గురించి మాట్లాడుకుంటారు. ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఆమె ఉన్నారు. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటే ఆమె ఫ్యామిలీని ఫ్యామిలీని చూసుకుంటారు. ఎన్టీఆర్ ని అన్ని విధాలుగా చూసుకోవడంలో బసవతారకం కీలక పాత్ర పోషించారు. బసవతారకం అంటే రామారావుకి కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కోసం ఆమె పేరుతో బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించారు. ఆమె 1984లో క్యాన్సర్ తో మృతి చెందారు. అమ్మ గురించి చెప్తూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు.
Advertisement
Also read:
నాన్న సినిమాలతో బిజీగా ఉండేవారని, అమ్మ కూడా నాన్నతో పాటు మద్రాస్ లో ఉండడంతో ఆమె మాతో చాలా తక్కువగా ఉండేదని, కానీ ఆమె తమను ఎక్కువగా చూసుకున్నారని అన్నారు. అమ్మగారు కూడా నాన్నతో పాటు మద్రాస్ లోనే ఉండేవాళ్ళు ఇక్కడికి రావడం తక్కువ. మేము హైదరాబాద్ లో ఉండే వాళ్ళం. ఆమె నాన్నగారికే తన జీవితాన్ని అంకితం చూశారు. ఉదయాన్నే మూడు గంటలకు లేచి వంట చేసేవారు మళ్లీ సాయంత్రం నాన్న షూటింగ్ నుండి వచ్చాక సడన్ గా ఏం చెయ్యమంటే అవి చేసేవారట. ఆమె చేతి వంట అంటే నాన్నకు చాలా ఇష్టం. ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అలా నాన్న వెనుక కూడా అమ్మ ఉన్నారని బాలయ్య చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!