Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల పాటు నువ్వా..? నేనా..? అన్నట్లుగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో హోరాహోరీ పోరు నడిచింది. ఇక ఈ హీరోలకు ఆరుపదుల వయసు వచ్చినప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ అందుకున్నాయి.
Advertisement
Read also: కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి సినిమాని బాబి డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యి రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది. అయితే వీరసింహారెడ్డి కలెక్షన్స్ తో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వంద రోజుల ఫంక్షన్ ని విరసింహారెడ్డి టీమ్ జరుపుతుంది. ఈ క్రమంలో వేసిన పోస్టర్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
అయితే ఈ పోస్టర్ పై “సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్” అంటూ వేశారు. ఇలా హైదరాబాద్ మొత్తం ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ పోస్టర్ ద్వారా బాలయ్య చిరంజీవికి తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారని తెలుస్తోంది. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ ఒక్కడే నటించగా.. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించారు. అయితే బాలయ్య సింగిల్ హ్యాండ్ తోనే సెంచరీ కొట్టారని ఆ పోస్టర్ లో అంతరార్థం. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాలయ్య అభిమానులు ఆనందంతో ఈ పోస్టర్ ని షేర్ చేస్తుంటే.. చిరు అభిమానులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా..? అని మండిపడుతున్నారు.
Read also: సుకుమార్ ఇంట్లో ఒక వైపు చిరు ఫోటో, మరి వైపు బాలకృష్ణ ఫోటో ఉంటాయి ఎందుకో తెలుసా ?