Advertisement
చంద్రబాబు అరెస్ట్ అవడంతో, ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయినా మౌనంగానే ఉండిపోయారు..? దాని వెనుక కారణం ఏంటి..? తాజాగా బాలకృష్ణ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు స్పందించలేదు అనే ప్రశ్న ఎదురైంది బాలయ్యకి. ఈ విషయంపై బాలకృష్ణ ఎప్పటి నుండో కోప్పడుతున్నారు అనుకుంట ఒకే ఒక్క పదంతో భగవంత్ కేసరిలోని డైలాగ్ తో బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే ఎంత స్పందించకపోతే ఎంత..? ఐ డోంట్ కేర్ అని బాలకృష్ణ చెప్పేసారు. అది కూడా నవ్వుతూనే బాంబు పేల్చారు బాలయ్య. సినిమా వాళ్ళని చంద్రబాబు అరెస్టుపై స్పందించమని నేను అడగను. అది కరెక్ట్ కాదు అది వాళ్ళ ఇష్టం అనవసరంగా వాళ్ళని ఇందులోకి లాగడం మంచిది కాదని బాలయ్య చెప్పారు.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలకి చెందిన వ్యక్తి. కానీ నందమూరి ఫ్యామిలీ వాడు కానీ బాలకృష్ణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అన్న దానికి ఐ డోంట్ కేర్ అని చెప్పేసారు. ప్రస్తుతం బాలయ్య చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. కనీసం అత్త భువనేశ్వర్ తో ఫోన్ మాట్లాడి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సరిపోయేది కొంచెం తన అత్తకి ధైర్యం కూడా చెప్పలేదు ఎన్టీఆర్. ఒకవేళ ఎన్టీఆర్ అలా ఫోన్ చేసినా ఇంత రచ్చ అయ్యేది కాదు.
Also read: