Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బహిరంగంగా కూడా చాలా సార్లు తన కోపాన్ని చూపించినా ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. ఆయన సహజంగా కోపాన్ని చూపించినా.. ఆయన మెత్తని మనసు అభిమానులకు సుపరిచితమే. అందుకే ఆయన కొంచం గట్టిగా మాట్లాడినా ఎవ్వరూ దూరం పెట్టరు.
Advertisement
ఓ వైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలయ్య బాబు.. మరోవైపు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర చూపిస్తున్నారు. ఇటు ప్రజల మన్ననలను పొందుతూనే.. అటు అభిమానుల సంతోషాన్ని కూడా పొందుతున్నారు. ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలను తీస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు బాలయ్య బాబు. ఏ స్థాయికి ఎదిగినా.. అందరిని మంచిగా చూడడం బాలయ్య కి అలవాటు.
Advertisement
అయితే.. ఆయనకు ముక్కుసూటి కోపం అనీ, కంటిచూపుతోనే అందరిని కాల్చేస్తారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే.. అలంటి బాలయ్య బాబు కూడా ఒకరికి భయపడతారట. ఆ వ్యక్తి ఎవరో కాదు.. బాలయ్య బాబు కన్నతల్లి బసవ తారకంగారు. బాలయ్య బాబు అందరిలోకీ చిన్న కావడంతో అందరు గారాబంతో ముద్దు చేసారు. కానీ తల్లి బసవతారకంగారు మాత్రం బాలయ్య బాబు చెందకూడదు అన్న ఉద్దేశ్యంతో బాలయ్య విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. అందుకే బాలయ్య బాబు తల్లి అంటే భయపడేవారట. అయితే.. బసవ తారకం గారు చనిపోయిన తరువాత.. బాలయ్య కోపాన్ని అడ్డుకునే వారు ఎవరు లేరన్న అభిప్రాయం అయితే ఉంది. ప్రస్తుతం బాలయ్య బాబు భవన్త కేసరి సినిమా షూటింగ్ పనులతో బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
మరిన్ని..
సిబిఎన్ ను జైల్లోనే ఉంచేసి.. రోడ్లపై ప్రచారం చేయనున్న వైసీపీ? ఎన్నికల వ్యూహం అదేనా?
సిబిఎన్ అరెస్ట్ తో ఈ లెక్కలన్నీ మారాయిగా.. జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే?