Advertisement
అప్పుడప్పుడు కొంతమంది నిర్మాతలు వాళ్ళ యొక్క స్టైల్ తో వార్తలు లోకి ఎక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో బండ్ల గణేష్ ఒకరు. ఈ ప్రొడ్యూసర్ దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా రంగంలో రాజకీయ రంగంలో తనదైన రీతిలో మార్పుని చూపిస్తూ దూసుకు వెళ్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ లైవ్ లో బూతులు మాట్లాడి షాక్ ఇచ్చాడు ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన గబ్బర్ సింగ్ రీరిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ మూవీకి హడావిడి బాగా కనిపించింది. అందుకు అనుగుణంగానే ప్రపంచం మొత్తంగా ఈ మూవీకి రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది.
Advertisement
దీంతో ఈ చిత్రానికి అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన ఈ సినిమా విడుదల అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా మూవీ హడావిడి కనపడుతోంది. హరీష్ శంకర్ బండ్ల గణేష్ చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ మధ్య నా ఫ్రెండ్ వాచ్ పెట్టుకుని వచ్చాడు అది ఎంత అని అడిగితే లిమిటెడ్ ఎడిషన్ 40 కోట్లు అన్నాడు అలాగే భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్ మనుషుల్ని పుట్టిస్తాడు.
Advertisement
Also read:
అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మోదీ అలాంటి వాళ్ళు అని చెప్పుకొచ్చారు. తర్వాత మాట్లాడుతూ భారతదేశంలో 130 కోట్ల మంది జనాలు ఉంటే అందులో లిమిటెడ్ పీసులుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళను మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి. కానీ మనలా అనుకుంటే మన అంతా ఎర్రి*** ఎవరు ఉండరు అని అన్నాడు. తర్వాత తను తప్పుని గమనించి అందరికీ సారీ కూడా చెప్పాడు. అయితే ఇది అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చాడేమోనని అంతా అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!