Advertisement
భార్య ఉండగా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వంటివి మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. మూడు ముళ్ళు వేసిన భార్యని జీవితాంతం ఆనందంగా చూసుకోవాల్సింది పోయి మరొకరితో సంబంధం పెట్టుకోవడం వంటి తప్పులు చేస్తున్న భర్తలు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. తన భర్త ఇంకొకరితో సంబంధాన్ని పెట్టుకోవడం తో బెంగళూరులో ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
Advertisement
ఆత్మహత్యకి ముందు మృతికి కారణాలు ఒక లెటర్ లో రాసి వాట్సాప్ లో షేర్ చేసింది. ఆమె అది చూసిన తల్లి వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనపడింది కూతురు. పోలీసులకి ఫిర్యాదు చేసింది. సూసైడ్ నోట్ లో భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆమె రాసింది. ఇదివరకే పవిత్ర కి పెళ్లయింది. భర్తకు విడాకులు ఇచ్చి చేతన్ గౌడ్ ని పెళ్లి చేసుకుంది. చేతన్ బిజినెస్ చేస్తున్నాడు.
Advertisement
పవిత్ర అక్కడే పని చేస్తుంది. భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పవిత్రకి తెలిసింది. నిలదీసి అడిగింది. దీంతో వీళ్ళ మధ్య గొడవలు అయ్యాయి. ఈ విషయాన్ని తన తల్లి పద్మకి కూడా చెప్పింది. మనస్థాపానికి గురైన పవిత్ర ఇంట్లో ఎవరూ లేనప్పుడు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఈ సూసైడ్ నోట్ ని వాట్సాప్ స్టేటస్ కింద పెట్టింది. తన తల్లి అది చూసిన వెంటనే ఇంటికి వెళ్ళింది. అప్పటికే తన కూతురు చనిపోయింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారు పోలీసులు. చేతన్ గౌడ్ అతని ప్రియురాలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. రెండు ఫోన్లని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also read: