Advertisement
ఐసీసీ ప్రపంచ కప్ 2023 లో భారత్ పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో నరేంద్రమోడీ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియాతో ఫైనల్స్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే.. ఇప్పటివరకు భారత్ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దానికి ప్రధాన కారణం భారత జట్టుకి ఉన్న బౌలింగ్ టీం, ఆ టీం కు గైడెన్స్, కోచింగ్ ఇచ్చిన కోచ్ రాహుల్ ద్రావిడ్ కావడం. గతంలో ఆడిన మ్యాచ్స్ కు ఈ వరల్డ్ కప్ లో మ్యాచ్స్ కు బౌలర్లకు ఉన్న వ్యత్యాసం స్పష్టంగానే తెలుస్తోంది.
Advertisement
అయితే.. అన్ని మ్యాచ్స్ లోనూ ఇరగదీసిన బౌలర్లు ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి చేతులెత్తేశారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటర్లను కట్టడి చేసి 240 పరుగులకే పరిమితం చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టాడు. బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ యాభై ఎనిమిది పరుగులను ఛేదించాడు. ఇండియన్ బౌలర్లు మాత్రం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
Advertisement
ప్రస్తుతం వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ తో పాటే రాహుల్ ద్రావిడ్ కోచ్ గా కాలపరిమితి కూడా ముగిసింది. వరల్డ్ కప్ వరకు అంటే రెండు సంవత్సరాల వరకు ఆయనను కోచ్ గా తీసుకుంటామని బీసీసీఐ కాంట్రాక్టు లో పేర్కొంది. అయితే.. ఈ కాంట్రాక్టు ను పొడిగిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఈ విషయమై రాహుల్ ద్రావిడ్ ను ప్రశ్నించగా.. తన కాంట్రాక్టు ని పొడిగించడంపై పెద్దగా ఆసక్తి చూపలేదని, ఇంతకంటే ఈ విషయమై ఎక్కువగా స్పందించలేనని చెప్పుకొచ్చాడు. హెడ్ కోచ్ గా ఇదే చివరి కాన్ఫరెన్సా? అన్న ప్రశ్నకి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. మ్యాచ్ గురించి మాట్లాడితే.. మరో 30 నుంచి 40 పరుగులు ఇండియా చేయగలిగి ఉంటె ఫలితం మరోలా ఉండేదని అన్నారు.
Read More:
Sathi Gaani Rendu Ekaralu OTT Release Date and Platform, Cast
CSI Sanatan OTT Release Date: When And Where To Watch CSI Sanatan Movie