Advertisement
భారత్ హోం సిరీస్ లో విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యతని ఇచ్చిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు భారత్ తో తలపడనున్నాయని తెలిపారు. బుధవారం విశాఖలో విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ కప్ మ్యాచ్ లు ముగియగానే ఆస్ట్రేలియా ఆడనున్న టీ-20 సిరీస్ లో తొలి మ్యాచ్ నవంబర్ 23న, ఫిబ్రవరి 02 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ని విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసిందని వివరించారు.
Advertisement
Advertisement
విశాఖలోని వైఎస్సార్ స్టేడియం ఇప్పటికే అన్ని ఫార్మాట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిందని ఇటీవల సీఎం జగన్ విశాఖలో మరో స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్ తో పాటు అన్ని క్రీడలు ఆడుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 25 ఎకరాల్లో నిర్మించాలన్నారు. దీనిపై ఏసీఏ ప్రణాళిక సిద్ధం చేస్తుందని.. స్థల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గోపినాథ్ రెడ్డి తెలిపారు.