Advertisement
బీసీసీఐ గొప్ప మనసుని చాటుకుంది. ఆఫ్గనిస్తాన్ తర్వాత నేపాల్ క్రికెట్ జట్టుకి ఇండియాలో సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ ఇండియాలో తన మ్యాచ్లు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనడానికి నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కెనడాలో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు సిరీస్ సన్నాహాల్లో భాగంగా నేపాల్ క్రికెట్ జట్టు బెంగళూరులోని ఎన్సీఏలో శిక్షణ తీసుకోనుంది. నేపాల్ జట్టు ముక్కోణపు సిరీస్ ఆడటానికి కెనడాకు వెళ్లే ముందు రెండు వారాల పాటు ఎన్సీఏలో ప్రాక్టీస్ చేస్తుంది.
Advertisement
Advertisement
అయితే ఈ సిరీస్లో కెనడా నేపాల్ తో పాటుగా ఒమన్ జట్టు కూడా పాల్గొన్నాయి. లీగ్ టు పట్టికలో నేపాల్ ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించింది. నేపాల్ జట్టు ఐసీసీఐ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ టు సిరీస్ కి సిద్ధం అవడానికి ఎన్సీఏ కి వెళ్తుంది.
Also read:
బెంగళూరులోని రెండు వారాల శిక్షణ ఆటగాళ్ల నైపుణ్యాలు వ్యూహాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. అమెరికా వెస్టిండీస్ లో జరిగిన T20 ప్రపంచ కప్ కి ముందే నేపాల్ జట్టు ఇండియాలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొంది. నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ పౌడర్ దీపేంద్ర సింగ్, సందీప్ ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్ T20 లీగ్ లో ఆడుతున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!