Advertisement
క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు పలు టోర్నీలు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు టోర్నీలు విజయవంతమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. సొంత లెజెండ్స్ లీగ్ ను నిర్వహించాలని సెక్రటరీ జై షా ను కోరారు.
Advertisement
మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది దాని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఇంకా ఈ ప్రతిపాదన మొదటి దశలోనే ఉందని BCCI అధికారి తెలిపారు. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ ని నిర్వహించాలని మాజీ క్రికెటర్లు కోరారని సమాచారం. ప్లేయర్ల వేలం తో పాటుగా సిటీ ఆధారిత ఫ్రాంఛైజ్లు కలిగి ఉండాలని జయశాను కోరినట్లు తెలుస్తోంది.
Also read:
Advertisement
Also read:
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ లెజెండ్స్ క్రికెట్ విజయవంతం అవ్వడంతో బీసీసీఐ కూడా సొంత లెజెండ్స్ పై ఆసక్తి కలిగి ఉందట. ఇది కార్యరూపం దాల్చితే BCCI వచ్చే ఏడాది లీగ్ ని ప్రారంభిస్తుందని తెలుస్తోంది, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది ఇప్పటికైతే ఇంకా దీనిపై స్పష్టత రాలేదు..
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ చూడండి!