Advertisement
సుమారు పదేళ్ల తరువాత స్వదేశం లో జరిగిన వన్డే ప్రపంచ కప్ తప్పక టీం ఇండియా నే గెలుస్తుందని ఎన్ని అసలు పెట్టుకున్న ఫాన్స్ కి తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఇక అతి త్వరలోనే మొదలయ్యే టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయం లో ప్రపంచకప్ కి ఎవరు సారథ్యం వహిస్తారు ? అనే విషయంపై కొద్దీ రోజులుగా చర్చలు మొదలయ్యాయి.
Advertisement
టీ 20 లకి సారథ్యం వహ్హిస్తున్న హార్దిక్ పాండ్య గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే, హార్దిక్ కి స్థానం లో ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా ప్రపంచకప్ కి మాత్రం రోహిత్ శర్మ నే కెప్టెన్ గా ఉండాలంటూ ఇటు అభిమానులు, అటు మాజీలు రోహిత్ కె ఓటు వేశారు. అంతే కాదు రోహిత్ శర్మ నే వరల్డ్ కప్ సారథ్యం వహించబోతున్నాడు అంటూ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇంతలో మరో ట్విస్ట్ ఎదురయ్యింది.
Advertisement
ఇప్పుడు ఈ వార్తే అభిమానుల్లో ధడ పుట్టింస్తోంది అదేందంటే ! టీ20 ప్రపంచకప్ నుంచి కోహ్లీ, రోహిత్ శర్మలని పూర్తిగా పక్కన పెట్టాయాలని నిర్ణయించుకున్నారట ! బీసీసీఐ అసలు ఎందుకు ఆలోచిస్తుంది ? అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా కూడా ఉండదంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక సమాచారం అందించారు.
ఇక వచ్చ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా లో జరగనున్న ఈ T20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఉంటారా లేదా అన్నది మరి కొన్ని రోజుల్లోనే స్పష్టత రానుంది. మరో వైపు దక్షిణాఫ్రికా లో టీం ఇండియా పర్యటిస్తుండగా ఇప్పటికే కోహ్లీ, రోహిత్ లు వైట్ బాల్ క్రికెట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరే దూరంగా ఉన్నారా ? లేక బీసీసీఐ పక్కకి పెట్టేసిందా ? ఆనంది క్లారిటీ లేదు అనే చెప్పాలి ఏది ఏమైనా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలకు సీనియర్లు లేకపోవడం పెద్ద లోటు అనే చెప్పాలి.