Advertisement
లవ్ స్టోరీ అంటే ఇంటరెస్ట్ ఎవరికి ఉండదు చెప్పండి. అందులో కుల మత భేదాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడి.. పెళ్లి పేరుతొ ఒక్కటిగా మారితే.. వారి బంధం మరింత బలపడి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి ఓ లవ్ స్టోరీనే వీరిది కూడా. కొద్దికాలం పరిచయంలోనే ప్రేమలో పడిన అమ్మాయి.. తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చిన విశేషాలను ఆమె మాటల్లోనే విందాం.. “ఆరోజు సతీష్ పుట్టిన రోజు. తనని చూడడం ఇక అదే చివరిసారి ఏమో అనుకున్నాను. మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు.. మనం ఇక విడిపోదాం.. కనీసం నువ్వైనా సంతోషంగా ఉండు అంటూ అతను చెప్పాడు. మన ప్రేమ కోసం నెలల తరబడి పోరాడుతున్నాం. కానీ నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు.. అని సతీష్ చెప్పేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు.
Advertisement
సతీష్ తల్లికి అతను నాతొ ఉండడం అస్సలు ఇష్టం లేదు. మీది కేవలం మూడు నెలల పప్పి లవ్.. మీరు ఈజీగా దాని నుంచి బయటపడగలరు అని చెప్పడం నాకు మరింత బాధ కలిగించింది. మేము మొదట తమిళ యూట్యూబ్ ఛానెల్ కోసం కంటెంట్‌ని సృష్టించడం ద్వారా ఆఫీస్ లో కలిసాం. చాలా కాలం వరకు మాది ప్రేమ అని మాకు తెలియలేదు. రోజు ఒకరిగురించి ఒకరం ఆలోచించే వాళ్ళం. మా లక్ష్యాలు, కలలు, ఆశయాలను పంచుకున్నాం. ఒకరోజు ఉన్నట్లుండి అతను ప్రపోజ్ చేసాడు. ఎవరూ ప్రేమించలేనంతగా.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు.
Advertisement
కేవలం మూడు నెలల్లోనే మేము ఒకరి గురించి మరొకరం బాగా అర్ధం చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ, మా పెళ్లికి అతని ఫ్యామిలీ సిద్ధంగా లేదు. ముఖ్యం అతని తల్లి నన్ను లేదా అతని ఫ్యామిలీలో ఎదో ఒకటిని మాత్రమే ఎంచుకోమని చెప్పింది. అతను పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. కానీ.. అలా చేసి మేము హ్యాపీగా ఉండలేమని మాకు తెలుసు. అందుకే ఒప్పుకోలేదు. మా ప్రేమ బలమైనది ప్రూవ్ చేయాలనీ అనుకున్నాం. అతని ఫ్యామిలీ తనని ప్రెషర్ చేస్తూనే ఉంది. దీనితో అతను బ్రేకప్ చెప్పలేక తప్పలేదు. నేను అతనితో కలిసి పని చేయడం అతని తల్లికి ఇష్టం లేదు. అందుకే అక్కడ జాబ్ వదిలేసి మరో జాబ్ వెతుకున్నాను.
మా దారులు వేరు అయినా మా మధ్య ప్రేమ చేరగలేదు. ఒకరినొకరు ఓదార్చుకున్నాం. మా సంతోషాన్ని పనిలో వెతుక్కున్నాం. సతీష్ ఎంతో కష్ట పడి తాను పని చేసే కంపెనీని కొన్నాడు. నేను అతనికి మరిన్ని ఛానెల్‌లను ప్రారంభించడంలో సహాయం చేసాను. ఇద్దరం కంపెనీని మరింత డెవలప్ చేసాం. అతని ఫ్యామిలీ మరొకరిని పెళ్లి చేసుకోవాలని సతీష్ ను ఒప్పిస్తున్నా.. సతీష్ ఒప్పుకోలేదు. 3 నెలల పప్పి లవ్.. 3 సంవత్సరాల పోరాటంగా మారింది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అతని ఫ్యామిలీకి అర్ధం అయ్యింది. చివరకు మనసు మార్చుకుని మా పెళ్లి చేసారు. మొదట మేము నమ్మలేకపోయాం. కానీ, ప్రేమ ఎంతటి ద్వేషాన్ని అయినా ఓడిస్తుంది అని మేము ప్రూవ్ చేసాం.
Read More:
పిల్లర్ నెంబర్ 9 రైల్వే స్టేషన్ ! ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
ఎన్టీఆర్ తన పిల్లల స్కూల్ ఫీజ్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా? ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
పల్లవి ప్రశాంత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? పేరు ముందు ఉన్న పల్లవి ఎందుకు పెట్టుకున్నారంటే ?