Advertisement
హీరో విజయ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురులేని హీరో.. ఆయన తెలుగు ఇండస్ట్రీలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ వారీసు సినిమా తర్వాత తన వ్యక్తిగత జీవితం సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. దీనికి కారణం ఆ స్టాప్ హీరోయిన్ అంటూ వార్తలు షికార్లు కొడుతున్నాయి.. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. దళపతి విజయ్ తను ఎలాంటి ఈవెంట్ కు వెళ్లిన తన భార్య సంగీత తో వెళ్తూ ఉంటారు.
Advertisement
ఈ మధ్యకాలంలో వారీసు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ తను మాత్రమే ఒంటరిగా రావడంతో తన భార్యతో విభేదాలు వచ్చాయంటూ వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా అట్లీ భార్య శ్రీమంతానికి కూడా విజయ్ సింగిల్ గా రావడంతో భార్యతో విడిపోతున్నారని వార్తలకు కాస్త బలం చేకూరింది. ఇదంతా పక్కన పెడితే లండన్ కు చెందిన సంగీత హీరో విజయ్ కి వీరాభిమాని, 1996లో విజయ్ ని కలిసేందుకు చెన్నైకి వచ్చి అనేక ప్రయత్నాలు చేసి ఎలాగోలా షూటింగ్లో విజయ్ ని కలిసి తన అభిమానాన్ని చాటుకుంది. దీంతో విజయ్ కూడా ఆమెపై మనసు పడి ప్రత్యేకంగా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు.
Advertisement
ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారడంతో 1999 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలోనే విజయ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ తో పికాల్లోతు ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణం వల్లే సంగీత విజయ్ మధ్య గొడవలు వచ్చాయని వీరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ న్యూస్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి. దీంతో విజయ్ అభిమానులు మాత్రం తను రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచనతో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
Also read;పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా.. బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే..!!