Advertisement
Bedurulanka 2012 review in telugu : కార్తికేయ, నేహా శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించగా క్లాక్స్ దర్శకత్వం వహించారు. అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటోరాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రానికి గాను మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రానికి నిర్మాణ సారుధ్యం వహించారు.
Advertisement
సినిమా: బెదురులంక 2012
నటీనటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు
దర్శకుడు : క్లాక్స్
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీతం : మణిశర్మ
విడుదల తేదీ: 24-08-2023
కథ మరియు వివరణ:
ఇంతకీ కథేంటంటే..
ఈ సినిమా కథ మొత్తం 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) అనే ఓ స్వేచ్ఛా జీవి తన మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్లో చేస్తున్న గ్రాఫిక్స్ డిజైనర్ జాబ్ గుడ్ బై చెప్పేసి బెదురులంకకు వస్తాడు. బెదురులంక గ్రామంలో అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీవీలో యుగాంతంపై ప్రచారం అవుతున్న వార్తలను చూసి భూషణం(అజయ్ ఘోష్) ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మాణుడు బ్రహ్మాం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తారు. యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి తమకి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని ప్రజలను నమ్మించడానికి ట్రై చేస్తారు.
Advertisement
ఆ ఊరి ప్రెసిడెంట్ గారు(గోపరాజురమణ) ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి వారికి చేస్తారు. కానీ శివ మాత్రం ఏమి ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివని ఆ ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఏం జరిగింది..? ఊరి ప్రజల్లో ఉన్న మూడనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు..? భూషణం ప్లాన్ని ఎలా ప్రెసిడెంట్ బయటపెట్టాడు..? శివ ప్రేమించిన చిత్ర (నేహాశెట్టి)ను చివరకు పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే దిశగా మిగతా కథ నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
సంగీతం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
కొన్ని స్ట్రాంగ్ సీన్స్
మైనస్ పాయింట్స్:
ఈ మూవీలో వచ్చే డబల్ మీనింగ్ డైలాగ్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ని కొంచెం ఇబ్బంది పెడతాయి.
అవసరమైన చోట నటన తప్ప హీరోయిజం చూపించే ప్రయత్నం చేయలేదు.
‘గెటప్’ శ్రీను న్యూస్ ప్రజెంటర్ పాత్రలో కొంత సేపటి తర్వాత బోర్ కొట్టించాడు .
రేటింగ్ : 3/5
Also read:
చిన్న వయసులోనే.. తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయిన నటులు వీళ్ళే..!
సినిమా చెట్టు గురించి మీకు తెలుసా..? ఎన్నో సినిమాలు ఇక్కడ తీసారట..!
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం.. మొదట రాజమౌళి హీరోలుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?