Advertisement
దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతులు తొక్కుతోంది. అసలే ఇవి 5 జీ రోజులు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న రోజులు ఇవి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు మనుషుల్లో మార్పు రావడం లేదు. కులాలు, మతాల పేరుతో ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు. పరువు, ప్రతిష్ట పేరుతో కన్నవారిని సైతం కడతెరుస్తున్నారు. మూఢ నమ్మకాలతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
Advertisement
అయితే తాజాగా జగిత్యాలలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించిన ఈ అపహరణ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల గ్రామీణ పోలీసుల కథనం మేరకు, జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లి కి చెందిన జక్కుల మధు (23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత (20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా, ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబం పై దాడి చేసి యువతిని అపహరించుకుపోయారు.
Advertisement
యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారింట్లో ఉండగా, ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, మధు కుటుంబం పై దాడి చేసి యువతిని అపహరించుకుపోయారు. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్న వదలకుండా శిరోముండనం అంటే, ఆమెకు గుండు కొట్టించారు. సోమవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతీని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
READ ALSO : కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?