Advertisement
పిల్లలకు ఏ విషయాలు తెలీదు. తల్లిదండ్రులే పిల్లలకి అన్ని విషయాలని నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లలకి మంచి బాటలో వెళ్లే విధంగా తీర్చిదిద్దాలి. పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యేవరకు పేరెంట్స్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా అండగా ఉండాలి. సలహాలు ఇవ్వాలి. కొన్ని విషయాలని చిన్నతనంలోనే పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఐదేళ్ల జీవితం చాలా ముఖ్యమైనది. ఐదేళ్ల లోపు వయసు వాళ్లకి పునాది లాంటిది. పునాది గట్టిగా ఉంటే జీవితం కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి విషయాలని నేర్పించాలన్నా ఇదే మంచి సమయం. ఐదేళ్ల లోపు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా అయితే కచ్చితంగా తల్లిదండ్రులు వాళ్లకు ఈ విషయాలని నేర్పించాలి.
Advertisement
పిల్లలకి చిన్న వయసులో కచ్చితంగా నేర్పించాల్సింది గౌరవించడం. పెద్ద వాళ్ళతో మాట్లాడే సమయంలో మర్యాదగా గౌరవంగా ప్రవర్తించే విధంగా నేర్పాలి. అలాగే షేరింగ్ అనేది చాలా ముఖ్యం. పిల్లలు ప్రతిదీ కూడా ఇతరులతో పంచుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. నలుగురికి అన్ని ఇవ్వడం నేర్పిస్తే పెద్దాయాక కూడా వాళ్ళలో ఆ అలవాటు ఉంటుంది. ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు తమ భావాలను ఎలా వ్యర్థపరచాలో కూడా వారికి నేర్పించాలి.
Advertisement
Also read:
కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి నిరాశ కలిగినప్పుడు ఎలా ఉండాలి ఇది నేర్పించాలి అలాగే పిల్లలకి పరిశుభ్రత గురించి కూడా నేర్పించాలి. భోజనానికి ముందు టాయిలెట్ కి వెళ్లడానికి ముందు తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అలాగే పళ్ళు సరిగ్గా తోముకునే విధంగా కూడా పిల్లలకు చెప్పాలి. ప్రతిరోజు పిల్లలు స్నానం చేసే విధంగా కూడా చూసుకోవాలి. పిల్లలు మీరు చెప్పే మాటలు సలహాలు వినేటట్టు అలవాటు చేయండి పెద్దల మాటలకి విలువ ఇవ్వాలని పిల్లలకు నేర్పించాలి. చిన్న వయసు నుంచే వాళ్లకు ఈ లక్షణాలని ప్రోత్సహించడం వలన సమర్థవంతంగా ఎదగగలుగుతారు చిన్నప్పటి నుంచి పిల్లలకి సమయం ప్రాముఖ్యతను కూడా నేర్పించాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!