Advertisement
ఉపవాసం చేయడం వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా..? ఉపవాసం చేస్తే నిజానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే చాలా లాభాలు ఉంటాయట. చాలామంది పండగలు లేదా ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేస్తారు. అది వారికి అలవాటు. ముఖ్యంగా ఆడవారు ఉపవాస దీక్ష ఎక్కువగా చేస్తూ ఉంటారు. కార్తిక మాసం వంటి సమయాల్లో ఎక్కువగా ఉపవాసం చేస్తారు. ఫాస్టింగ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరు ఉపవాసం రోజు లిక్విడ్స్ తీసుకుంటారు. సాలిడ్స్ తీసుకోరు. ఇంకొంతమంది అసలేమీ తీసుకోరు. నీళ్లు కూడా తాగరు.
Advertisement
మరికొందరు రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండి రాత్రి ఆహారాన్ని తీసుకుంటారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉపవాసం చేస్తారు. వారంలో ఒకరోజు ఉపవాసం చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తే ఒంట్లో ఇన్సులిన్ ని గ్రహించే స్వభావం మెరుగుపడుతుంది. గ్లూకోజ్ నిల్వల పై నియంత్రణ పెరుగుతుంది. ఉపవాసం ఆటోఫాగిని ప్రేరేపిస్తుంది. కణాల నుంచి పాత దెబ్బతిన్న ప్రోటీన్స్ ని తొలగించే ప్రక్రియని ఆటో ఫాగి అని అంటారు.
Advertisement
Also read:
వారానికి ఒకరోజు ఉపవాసం చేయడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది. గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. బరువు తగ్గాలని భావిస్తున్న వారు వారానికి ఒకరోజు ఉపవాసం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. కొవ్వు తరిగిపోవడమే కాకుండా ఆకలిపై నియంత్రణ లభిస్తుంది. అధిక రక్తపుటు సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు, ఒత్తిడి వ్యాధుల్ని తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. గాయాలు ఏమైనా అయితే కూడా త్వరగా నయం అవుతాయి.
ఆరోగ్య చిట్కాలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!