Advertisement
సాధారణంగా మన ఆరోగ్యానికి ఉలవలు చాలా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది ఉలవలను తీసుకుంటుంటారు. ఉలవలు రుచికి కూడా చాలా బాగుంటాయి. ఉలవలతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. పోషక ఆహారం తీసుకోవాలనుకునే వాళ్లు ఉలవలను కచ్చితంగా తీసుకోండి. ఉలవల్లో ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఫాస్పరస్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగానే ఉంటాయి. ఉలవలను తీసుకుంటే ఫైబర్ ఇందులో చాలా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. డైట్ లో చేర్చుకుంటే అజీర్ణ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలుండవు. మలబద్ధకం సమస్య నుంచి కూడా దూరంగా ఉండవచ్చు.
Advertisement
Advertisement
ఉలవల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారు ఉలవలను తీసుకున్నట్టయితే షుగర్ బాధ నుంచి బయటపడొచ్చు. షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. రెగ్యలర్ గా ఉలవలను తీసుకుంటే ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండరాలను దృఢంగా ఉంచగలదు. ఉలవలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఉలవల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది. ఉలవలతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఉలవలను తీసుకోండి.. ఆరోగ్యంగా, అందంగా ఉండండి.