Advertisement
ఉరితీసిన ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా, భగత్ సింగ్ భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్. ఆయనకు మార్చి 23, 1931న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరిశిక్షను విధించిన సంగతి తెలిసిందే. చనిపోయే చివరి క్షణంలో కూడా ఆయన తన దేశభక్తిని వీడలేదు. నేడు (సెప్టెంబర్ 28 ) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భగత్ సింగ్ ఒక అద్భుతమైన లెక్చరర్. ఆయన తన అనుభవాలను, అనుభూతులను ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా పంచుకున్నారు. అదే స్వేచ్ఛ భారత దేశ ప్రజలందరికి ఉండాలని అభిలషించారు.
Advertisement
ఆయన లియాపూర్ జిల్లాలోని బంగాలో 28 సెప్టెంబర్ 1907న జన్మించారు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. చనిపోయే చివరి క్షణంలో కూడా ఆయన మాట్లాడిన వింటే భారతీయుల ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దేశానికీ స్వతంత్రం వచ్చినప్పుడు భారతీయుల ఆనందం అంతా ఇంతా కాదు. వారికి ఆనందంతో ఛాతీ ఉప్పొంగింది. అయితే.. ఈ ఆనందానికి మూల కారణం దేశం కోసం ప్రాణాలు వదిలేసుకున్న ఎందరో మహనీయులు. వారిలో భగత్ సింగ్ కూడా ఉన్నారు.
Advertisement
భగత్ సింగ్ జీవితంలో ఓ కీలక సంఘటన గురించి ఇపుడు చెప్పుకుందాం. మార్చి 23, 1931 న ఆయనను ఉరి తీయబోయే రోజున జరిగిన సంఘటన ఇది. ఉదయం నాలుగు గంటల సమయంలో భగత్ సింగ్ ను ఉరి తీయడానికి సర్వం సిద్ధం చేసారు. ఇతర ఖైదీలందరూ ఆయనను ఉరి తీసే మార్గం వైపు వెళ్లి చూస్తున్నారు. భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను కూడా అదే రోజు ఉరి తీశారు. భగత్ అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఉన్నట్లుండి పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు భీమ్‌సేన్ సచార్ తన గొంతు విప్పారు. లాహోర్ కుట్ర కేసులో ఎందుకు మిమ్మల్ని మీరు రక్షించుకోలేదు అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా భగత్ సింగ్ విప్లవకారులు చనిపోవాలి అని ఒక్క మాటని సమాధానంగా చెప్పారు. ఇక ఉరి తీసే ముందు దేవుడిని ప్రార్ధించమని అడగగా.. నేను నా జీవితంలో ఎప్పుడు దేవుడిని ప్రార్ధించలేదు. ఇప్పుడు ప్రార్ధిస్తే నేను పిరికివాడినని, క్షమించమని అడిగానని అనుకుంటారు అని అన్నారట. భగత్ సింగ్ గురించి రాసిన అన్ని పుస్తకాల్లోనూ ఈ మాటలు ఉంటాయి.
మరిన్ని..
చంద్రబాబు అరెస్ట్ పై “సీ ఓటర్ సర్వే” లో సంచలన విషయాలు వెలుగులోకి..!
గుడివాడలో టీడీపీ గెలుస్తుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
ఇది కదా కేసీఆర్ మార్క్ రాజకీయం అంటే.. ఈ దెబ్బతో ప్రత్యర్థులు గల్లంతే !