Advertisement
Bhagavad Gita: Life, Quotes, Slokas, Images, Meaning in Telugu: లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతార పురుషుల్ని, మహర్షుల్ని మహానుభావులను తలుచుకుంటూ వాళ్లు చేసిన మహోపకారానికి 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు బోధించిన జ్ఞానము కనుక ఇది పవిత్ర గ్రంధాలలో ఒకటిగా పరిగణించబడింది. ప్రపంచంలో ఏ మత గ్రంధాలకి లేనంత విశిష్టత భగవద్గీత కి మాత్రమే ఉంది. లోకానికి గీత వలన జరిగిన మహోపకారానికి గుర్తుగా గీతా జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాము.
Advertisement
వీటిని కూడా చదవండి: Best Quotes in Telugu
భగవద్గీత ని గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. గీతోపనిషత్తు అని కూడా అంటుంటారు. భగవద్గీత నుండి మార్గదర్శకత్వం పొందిన వాళ్లలో ఎంతోమంది యోగులు, తాత్వికులు ఉన్నారు. భగవద్గీత కి హిందూమతంలో ఉన్న విశిష్టత మామూలుది కాదు. ఈరోజు భగవద్గీత కి సంబంధించి కొన్ని కొటేషన్స్ చూద్దాం. వీటి నుండి కూడా మనం ఎన్నో విషయాలని నేర్చుకుని ఆచరించవచ్చు. జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు.
Bhagavad Gita Quotes in Telugu
- 1. నీది అంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.
- 2. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు… పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు.
- 3. జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.
- 4. ఓడిపోయావని భాదించకు… మరల ప్రయత్నించి చూడు.. ఈసారి విజయం నీ తోడు వస్తుంది…
- 5. మానసిక శాంతి లేని జీవితం వృధా… కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది.
- 6. కుండలు వేరైనా మట్టి ఒక్కటే… నగలు వేరైనా బంగారం ఒక్కటే.. అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే.. అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ.
- 7. అతిగా స్పందించడం…. అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం… అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి. స్థిత ప్రజ్ఞతతో జీవించాలి. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.
- 8. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు.
- 9. గుర్తుంచుకో ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడు ఏం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.
- భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు.. మనం శవంగా మారేలోపు జీవితపరమార్ధాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం.
- మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు.. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.
- వరైతే అన్నీ పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో.. సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో..అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని – భగవద్గీత
- ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అందరికీ సమాన గౌరవాన్ని ఇస్తాడు, సమాన గౌరవాన్ని పొందుతాడు. అతను ఆధ్యాత్మిక అభిలాషి . ఏనుగు, ఆవు, కుక్క వంటి ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలనుకుంటాడు.
- ఏది జరిగినా మంచిదే. ఏం జరిగినా అది మంచికే జరుగుతోంది. ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది.
Bhagavad Gita Images in Telugu
Advertisement
Karma Bhagavad Gita quotes in Telugu